Chalo Hyderabad | పాపం పెన్షనర్స్..

Chalo Hyderabad | పాపం పెన్షనర్స్..
Chalo Hyderabad, కరీమాబాద్, ఆంధ్రప్రభ : పెన్షనర్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని జిల్లా అధ్యక్షుడు తుమ్మ వీరస్వామి ప్రధాన కార్యదర్శి గునిగంటి సాంబయ్య డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర పెన్షనర్స్ జాక్ పిలుపు మేరకు ఛలో హైదరాబాద్ (Chalo Hyderabad) కార్యక్రమంలో పాల్గొనేందుకు వరంగల్, (Warangal) హనంకొండ జిల్లా నుండి భారీగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ రెండు బస్సులలో తరలి వెళ్లారు. రిటైర్డ్ అయి 18 నెలలు గడిచినా రిటైర్డ్ పెన్షనర్ల బకాయిలు నేటి వరకు చెల్లించలేదన్నారు. 8 మంది రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే అందజేయాలని వారు డిమాండ్ చేశారు.
