ఇంటింటి ప్రచారంలో చల్లా జ్యోతి

ఇంటింటి ప్రచారంలో చల్లా జ్యోతి

పరకాల, ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ): పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి పరకాల మున్సిపల్ ఎన్నికల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజు పరకాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా శనివారం రోజు పట్టణంలోని 13వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి దగ్గు సునీత గెలుపు కోసం పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి సతీమణిచల్లా జ్యోతి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులోని మహిళా ఓటర్లు చల్లో జ్యోతి నీ సాదరంగా ఆహ్వానిస్తూ కుశల క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా చల్లా జ్యోతి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్ అభివృద్ధి పాలనను ప్రజలకు వివరిస్తూ ఓటర్ల మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply