Central Minister | భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోంది..

Central Minister | భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోంది..
రాష్ట్రపతితో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026లో పాల్గొనడం గౌరవంగా ఉంది
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
Central Minister | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026లో భారత రాష్ట్రపతి సాయుధ దళాల సర్వసైన్యాధిపతి ద్రౌపది ముర్ము తో కలసి పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.ఈ మేరకు బుధవారం అయన క్యాంపు కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేసారు.
విశాఖ లో ఐ ఎన్ ఎస్ సుమేధా నౌకపై ప్రయాణిస్తూ రాష్ట్రపతితో పాటుగా గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠిలతో కలసి భారత నౌకాదళం, మిత్ర దేశాల నౌకాదళాలకు చెందిన 72 ఆధునిక యుద్ధ నౌకలు, సబ్‌మరైన్లను సమీక్షించారన్నారు.
యునైటెడ్ త్రూ ఆడియన్స్ అనే థీమ్‌తో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 భారత్ సముద్ర శక్తి పెరుగుదలను, ప్రపంచ దేశాలతో బలపడుతున్న భాగస్వామ్యాలను ప్రతిబింబించిందని,ఈ సందర్భంగా స్వదేశీ విమాన వాహక నౌక ఐ ఎన్ ఎస్ విక్రాంత్ పాల్గొనడం గర్వకారణమని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన ఈ నౌక రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీకగా నిలిచిందనీ అన్నారు.
అంతర్జాతీయ నావికాదళాల భాగస్వామ్యం ఇండో-పసిఫిక్ అంతటా సముద్ర భద్రత, సహకారం పట్ల సమిష్టి సంకల్పాన్ని తాజా కార్యక్రమం ప్రదర్శించిందనీ రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతొందని.. అందుకు తాజా కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు.

