CCTV network | సిటీ సీసీటీవీ కెమెరాల నెట్‌వ‌ర్క్‌ బలోపేతానికి ‘ఐస్’

CCTV network | సిటీ సీసీటీవీ కెమెరాల నెట్‌వ‌ర్క్‌ బలోపేతానికి ‘ఐస్’

  • నిఘానేత్రాల నిర్వహణ కోసం ప్రత్యే్క బృందాల ఏర్పాటు
  • ప్రారంభించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్

CCTV network | ఖైరతాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్‌(network of CCTV cameras)ను మరింత బలోపేతం చేసేందుకు అడ్వాన్స్‌డ్ సిటీ సర్వైలెన్స్ గ్రిడ్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్ (ఏఎస్ఎస్జీపీ) అనే నూతన వ్యవస్థను హైదరాబాద్ సిటీ పోలీస్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎంపవరింగ్ యూవర్ ఎవరీడే సేప్టీ(Empowering Your Everyday Safety)(ఐస్) బృందాలను ఏర్పాటు చేసింది.

సీసీటీవీల వ్యవస్థను విస్తరించడంతో పాటు, అవి నిరంతరం సజావుగా పనిచేసేలా చూడటంతో పాటు నిర్వహణ చర్యలను ఈ బృందాలు చేపడుతాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీ ఆడిటోరియం(TGICCC Auditorium)లో ఈ రోజు అడ్వాన్స్‌డ్ సిటీ సర్వైలెన్స్ గ్రిడ్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్ తో పాటు ఐస్ బృందాలను హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ప్రారంభించారు.

ఉన్నతాధికారులతో కలిసి లోగోను ఆవిష్కరించారు. ఐస్ బృందాలకు రిపేర్ కిట్ లను అందజేశారు. వారికి కేటాయించిన నూతన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. సిటీలో ప్రస్తుతం 16 వేలకు పైగా వీధి సీసీటీవీ కెమెరాలు హైదరాబాద్ సిటీ పోలీస్(Hyderabad City Police) ఆధ్వర్యంలో ఉండగా.. 50 వేలకు పైగా కమ్యూనిటీ, ప్రైవేట్ ఫీడ్లు కొనసాగుతున్నాయి.

మరో ల‌క్ష‌కు పైగా నేనుసైతం సీసీటీవీ కెమెరాలున్నాయి. అదనంగా బాడీ-వోర్న్ కెమెరాలు, త్వరలో ప్రవేశపెట్టబోయే పోలీస్ డ్రోన్లు వంటి ఆధునిక పరికరాలు కూడా ఈ నెట్‌వర్క్‌లో భాగం కానున్నాయి. ఈ విస్తృత వ్యవస్థను సమర్థంగా నిర్వహించేందుకు సాంకేతికత ప్రమాణికరణ, అంతర్గత మరమ్మతు సామర్థ్యం, స్థిరమైన కార్యచరణ నమూనాలను లక్ష్యంగా పెట్టుకొని ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ నిర్ణయించింది. EYES వ్యవస్థలో భాగంగా పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Leave a Reply