CCS SI | నకిలీ పోలీసు..

CCS SI | నకిలీ పోలీసు..


CCS SI | మచిలీపట్నం, ఆంధ్ర ప్రభ : మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన వివాహితను మంగళగిరి (Mangalagiri) సీసీఎస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఐ)ను అంటూ మోసానికి పాల్పడ్డాడు. అడిగింది ఇవ్వకపోతే.. ఆమె భర్తను చంపేస్తానని మహిళను బెదిరించి దాదాపు 130 గ్రాముల బంగారం, లక్ష రూపాయలు స్వాహా చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి గురించి పలువురిని విచారించి నకిలీ పోలీస్ అని తెలుసుకున్నాకా.. డిసెంబర్ 7న మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
మహిళ ఫిర్యాదు పై పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Leave a Reply