సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్

సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్

వ‌ర్గ‌ల్, ఆంధ్ర‌ప్ర‌భ‌ : సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా వర్గల్ మండలంలోని మీనాజీపేట్ గ్రామంలో సిద్దిపేట సీపీ సాధన రష్మీ పెరుమాళ్ సీసీ కెమెరాలను ప్రారంభించారు. స్నేహ ఫౌండేషన్ సహకారంతో గ్రామంలో 19 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ సీసీ కెమెరాల వలన గ్రామ భద్రత పెరుగుతుందని, నేర శోధనలో సీసీ కెమెరాల ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

సిద్దిపేట జిల్లాలను ‘క్రైమ్ ఫ్రీ’ గా మార్చడానికి ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ అనే ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కెమెరాల పనితీరును ఎల్లవేళలా పరిశీలించాలని వాటి నిర్వహణ చూసుకోవాలని గ్రామ పాలకవర్గానికి సూచించారు. నిఘా నేత్రాలు గ్రామంలో ఉంటే భద్రత ఎక్కువగా ఉంటుందని, దొంగతనాలు, దోపిడీలు జరగకుండా కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పలు ఘటనలలో సీసీ కెమెరా ఫుటేజ్ ఎంతో కీలకంగా మారిందని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీ నర్సింహులు స్నేహ ఫౌండేషన్ ఛైర్మెన్ రాజేందర్ రెడ్డి, గజ్వెల్ సీఐ రవి రాజు, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి, సర్పంచ్ కీసరి వెంకటేష్, ఉపసర్పంచ్ రాణి సహదేవ్ గౌడ్, పంచాయితీ సెక్రటరీ బాబు రావు,వార్డు మెంబర్లు , గ్రామస్తులు, పాల్గొన్నారు.

Leave a Reply