400మందిపై కేసు.. మాజీ మంత్రి స్పందన
(ఆంధ్రప్రభ, మచిలీపట్నం ప్రతినిధి) : కేసులు పెట్టి లోపలికి పంపితే గర్వంగా వెళ్తామని, మేమేమీ హత్యలు(The murders) చేసి వెళ్లడంలేదని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంపై పోలీస్ వైఖరిపై మాజీ మంత్రి పేర్ని నాని శనివారం మీడియా( media)తో మాట్లాడారు. జిల్లా ఎస్పీ చర్యలు స్వాగతిస్తున్నాం, రూల్ మైండ్(rule mind)తో విధులు నిర్వహిస్తున్న ఎస్పీ అందరి విషయంలో ఒకేలా చట్టాన్ని అమలు అయ్యేలా చూడండని సూచనలు చేశారు.
రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసు నమోదు(case registration) చేయడం, ఆ కేసులో 10 సంవత్సరాల శిక్షకు సంబంధించిన సెక్షన్ కూడా వేసి బెయిల్ రాకుండా మీరు చేసే ప్రయత్నం ఎక్కడ చూడలేదన్నారు. ప్రజల పక్షాన నిలిచి పోరాడుతూ ఆ క్రమంలో జైలుకు వెళ్లడంతో తప్పు లేదని, అయినా 365 రోజుకు ఎక్కడా లేని విధంగా ఆర్టికల్ 30(Article 30) పెట్టడం చూస్తుంటే దారుణంగా ఉందన్నారు.
మీపై డిజిపి, హోమ్ మినిస్టర్(Home Minister) వత్తిడి చేసి ఉండొచ్చని, ప్రతిపక్షాల నోరు ఎత్తనివ్వకుండా చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటే అన్నారు. మచిలీపట్నంలోని(Machilipatnam) జనసేన, టీడీపీ లోని కొందరు గుండాలు , రౌడీలు(Rowdies) చట్టాని అతిక్రమిస్తున్నారు వారిపై కూడా ఇలాగే చర్యలు తీసుకోండన్నారు. పాత ఎస్పీలా కాకుండా కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఆయా పోలీస్ అధికారులను సైతం గుర్తించాలని కోరారు.

