Carden Search | నందికొట్కూర్ పట్టణంలో కార్డెన్ సర్చ్..

Carden Search | నందికొట్కూర్ పట్టణంలో కార్డెన్ సర్చ్..
- ఆన్లైన్ సైబర్ క్రైమ్, డ్రగ్స్… ప్రజలకు అవగాహన..
- వాహనదారులు తస్మాత్ జాగ్రత్త : సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి
Carden Search | నందికొట్కూరు, ఆంధ్రప్రభ : సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని నందికొట్కూరు అర్బన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పి రామాంజనేయ ఆధ్వర్యంలో సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎస్సై చంద్రశేఖర్ పట్టణంలోని నిర్వాసిత కాలనీలో కార్డెన్ సర్చ్(Carden Search) నిర్వహించారు. కాలనీలో సరైన ధృవ పత్రాలు(ocumentary evidence) లేని వాహనాలను గుర్తించి సీజ్ చేశారు.
ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… వాహనదారులు వాహనానికి సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం డ్రగ్స్ పై బస్తీవాసులకు అవగాహన కల్పించారు. నందికొట్కూరు పట్టణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉంటున్న వారు కావడంతో ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులు ఎక్కువగా నివసిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలు, గంజాయి బారిన పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. గంజాయి(marijuana)కి అలవాటు పడి, పశ్చాత్తాపంతో ముందుకు వచ్చే వారికి ఉచితంగా చికిత్స, సేవలు అందించడానికి పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.

నేరాలను అరికట్టడంలో భాగంగా ఇళ్లను అద్దెకిచ్చే యజమానులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలని సూచించారు. కొత్తగా ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు, అద్దెదారుల ఆధార్ కార్డుతో సహా పూర్తి వివరాలను సేకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు, అసాధారణ ప్రవర్తన గల అద్దెదారుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు సహకరిస్తామని కాలనీవాసులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
