కారు బోల్తా.. ఒకరు మృతి
హైదరాబాద్, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) పై జరిగిన రోడ్డు ప్రమాదం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు విషాదం తెచ్చింది. ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు బోల్తా (car overturned) పడటంతో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
సమాచారం ప్రకారం… ఉద్యోగులు సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullapurmet) సమీపంలో వారి కారు అదుపు తప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిందన్న సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు (police) అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.