దుబాయ్: వరుస విజయాలతో ఇప్పటికే సూపర్-4లో స్థానం సంపాదించిన డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, నేడు చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఒమాన్‌తో తలపడనుంది. పాకిస్తాన్, యూఏఈపై వరుసగా గెలిచిన భారత్.. ఇప్పుడు ఈ నామమాత్రపు మ్యాచ్ తో హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది.
టాస్ అప్డేట్ !
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
జట్టు మార్పులు
భారత్ – వరుణ్ చక్రవర్తి & జస్ప్రీత్ బుమ్రా స్థానంలో… హర్షిత్ రాణా & అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చారు.
ఒమన్ – అలీ & హస్నేన్ అలీ షా స్థానంలో.. మొహమ్మద్ నదీమ్ & జిక్రియా జట్టులోకి వచ్చారు.
తుది జట్లు :
ఒమన్ : జతీందర్ సింగ్ (కెప్టెన్), అమీర్ కలీమ్, హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), ఫైసల్ షా, మహ్మద్ నదీమ్, ఆర్యన్ బిష్త్, జిక్రియా ఇస్లాం, షకీల్ అహ్మద్, జితేన్ రామానంది, సమయ్ శ్రీవాస్తవ.
ఇండియా : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
భారత జట్టు ప్రణాళికలు..
భారత జట్టుకు ఈ పోరు గెలుపు కన్నా ప్రిపరేషన్‌కి ఎక్కువ ప్రాధాన్యం. సూపర్ ఫోర్ దశకు ముందుగా బౌలర్లకు మరిన్ని ఓవర్లు వేయించే అవకాశం, అలాగే మిడిల్ ఆర్డర్, టెయిల్ ఎండ్ బ్యాటర్లకు క్రీజ్‌లో సమయం దొరకే అవకాశం ఈ మ్యాచ్‌తో లభిస్తుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. అంతేకాకుండా, టాప్-8లో ముగ్గురు ఆటగాళ్లు రెండు మ్యాచ్‌లు ఆడినా ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేకపోయారు. ఈ పోరు ఆ లోటును భర్తీ చేయడానికి సరైన వేదికగా నిలుస్తుంది.
ఓమాన్ టార్గెట్…
ఓమాన్‌కు ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే, టీమిండియా లాంటి పెద్ద జట్టుతో తలపడే ఇదే వారి చివరి అవకాశం. వచ్చే నెలలో వారు ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ ఆసియా & ఈస్ట్-ఆసియా-పసిఫిక్ రీజినల్ క్వాలిఫైయర్ ముందు ఇది వారికి మంచి ప్రాక్టీస్ అవుతుంది.
ఆ టోర్నమెంట్లో మొత్తం తొమ్మిది జట్లు పోటీ పడతాయి. అందులో కేవలం మూడు జట్లకే వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌కు అవకాశం లభిస్తుంది. ఆ మూడింటిలో ఒకటిగా నిలవాలని ఓమాన్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే, ఆసియా కప్‌లో భారత్‌తో ఆడే ఈ తుదిమ్యాచ్ ద్వారా వచ్చిన అనుభవం వారికి చాలా ఉపయోగపడుతుంది.