కంది పంటలో గంజాయి సాగు…

తిర్యాని, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని చెలిమేలా కొద్దుగూడ గ్రామ శివారులో కంది పంట మధ్య గంజాయి మొక్కలు పెంచుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్రం పాపారావు (32) అనే రైతు తన పొలంలో గంజాయి మొక్కలు నాటుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

తిర్యాని ఎస్సై వెంకటేష్ తనిఖీలు నిర్వహించిన సమయంలో నిందితుడి పత్తి పొలంలో మొత్తం 10 గంజాయి మొక్కలు ఉన్నట్లు తేలింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై వెంకటేష్ మాట్లాడుతూ, గంజాయి సాగు చట్టవిరుద్ధమని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి సాగు, రవాణా రెండూ తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయని గుర్తు చేశారు.

అలాగే, సమాజంలో యువత భవిష్యత్తు దృష్ట్యా మత్తు పదార్థాలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎవరైనా గంజాయి సాగు లేదా వ్యాపారం గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.

Leave a Reply