Candidate | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని శనిగరం గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసిన సర్పంచ్ అభ్యర్థి ఊటుకూరి అశోక్ ప్రజాదరణను సొంతం చేసుకుంటున్నారు. గురువారం గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ వృద్ధులకు, మహిళలకు ఆప్యాయంగా పలుకరించి ఉంగరం గుర్తుకు మీ విలువైన ఓటు వేసి ఆశీర్వదించండి. మీకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాను అని ఆశీర్వదించమని విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని ప్రతి ఓటరుని కలిసి, ప్రజల సమస్యలు వివరంగా విని, పరిష్కారానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. గ్రామ ప్రజల కోసం నిరంతరం సేవ చేయడమే.. తన లక్ష్యమని ఆయన వివరించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నమ్మకంతో తనను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారని ఉటుకూరి అశోక్ తెలిపారు. ఈ నెల 14న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఉంగరం గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. గెలుపు సాధించిన వెంటనే ప్రభుత్వం ద్వారా గ్రామానికి వచ్చే ప్రతి పథకాన్ని అర్హులైన ప్రతి యువకునికి, కుటుంబానికి అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Candidate | స్పీడు పెంచిన అశోక్..

