Candidate | గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా

Candidate | గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా

  • ఆలోచించి ఒక్కసారి అవకాశం కల్పించండి
  • కాంగ్రెస్ సర్పంచి అభ్యర్థి కల్తీ ప్రమీల

Candidate | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని మారుమూల ఏజెన్సీ గిరిజన పెద్ద వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని.. ఒక్కసారి ఆలోచించి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కల్తీ ప్రమీల కోరారు. ఎన్నికల్లో త‌న‌కు కేటాయించిన‌ కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. మండల కేంద్రానికి సుదూర ప్రాంతం కావడంతో 15 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్డును అధికార కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ సమాచార గృహ నిర్వాహణ‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చేనేత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల సారధ్యంలో బీటీరోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు.

పెద్దవెంకటాపురం, సింగారం, పాలగుంపు ప్రజలకు త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తానని, తాగు సాగునీరు డ్రైనేజీ నిర్మాణాలు చేపడతానని, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేస్తానని మౌలిక సౌకర్యాలు అభివృద్ధిని ఆళ్లపల్లి మండల కేంద్రంలోని అగ్రగామిగా నిలిపేందుకు తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదించి తనకు సర్పంచిగా అవకాశం కల్పించాలని, సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన నిలిచానని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ నాయకులు కొర్ష నాగేశ్వరరావు తాటి నీలమయ్య కల్తీ బుచ్చయ్య కొమరం లాలయ్య కల్తి నరేందర్లతో కలిసి గ్రామంలో ముమ్మరంగా ఇంటింటికి ప్రచారం చేపట్టామని తెలిపారు. ప్రతి గడపగడపకు వెళ్లి ఓటర్లను కలుసుకొని గ్రామాభివృద్ధి కోసం ఎన్నోసార్లు పాలకులకు విన్నవించినా సమస్య పరిష్కారం లేదని గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ రాజకీయాలకతీతంగా అందజేయడమే తన లక్ష్యమని కల్తీ ప్రమీల అన్నారు.

Leave a Reply