Candidate | అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం
- ఆశీర్వదిస్తే ప్రజలకు సేవ చేస్తా
- స్వతంత్ర సర్పంచి అభ్యర్థి పూనేం శ్రీనివాస్
Candidate | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధి రామంజిగూడెం గ్రామపంచాయతీలోని స్వతంత్ర సర్పంచి అభ్యర్థి పూనెం శ్రీనివాస్ గెలుపే లక్ష్యంగా ప్రచారంలోని హోరాహోరీగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. రామంజిగూడెం గ్రామ వ్యక్తిగా, విద్యావంతుడిగా గ్రామంలో సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన యువనాయకుడు శ్రీనివాస్ మండల పరిధి వలసల్ల, రాయిలంక గ్రామాలో మరింతగా ప్రచారం విస్తృతం చేశారు. తునికి బండల,వలసల్లా, రాయిలంక,ఇప్పనపల్లి, రామాంజిగూడెం గ్రామాల్లో రోజువారీగా ఉదయం సాయంత్రం వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ అభివృద్ధికి అహర్నిశలుగా కృషి చేస్తానని, ఈ ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. గెలిపిస్తే ప్రజలందరికీ 24 గంటలు అందుబాటులో ఉండి సేవచేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానన్నారు.

