CANAL | కాలువలో డెడ్ బాడీ
గుర్తుతెలియని వ్యక్తిది లభ్యం
CANAL | ముత్తుకూరు, ఆంధ్రప్రభ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం పరిధిలో నెల్లూరు -ముత్తుకూరు రోడ్డు మార్గంలో రాష్ట్ర ప్రభుత్వ జల వనరుల శాఖ ముత్తుకూరు సాగునీటి పారుదల కాలువలో ఈ రోజు గుర్తుతెలియని పురుషుడి మృతదేహం బయటపడింది. స్థానిక రైతులు గుర్తించి తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు రమేష్ కుమార్ శర్మ, పోలీస్ (Police) శాఖతోపాటు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.

