ఉపవాసం ఉన్నవారు ప్రసాదాన్ని స్వీకరించవచ్చా?

వ్రతాలు, నియమాలలో భాగంగా చాలా మంది ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఉపవాసం అంటే ‘ఉపవసతి’ అనగా భగవంతుని దగ్గర ఉండుటా అని అర్ధం లేదా మన మనసుని భగవంతుని దగ్గర ఉంచుట అని అర్ధం. మనసు నిలకడగా ఉండాలంటే ఆహార నియమాన్ని పాటించాలి కాబట్టి నిరాహారంగా ఉండాలి. ఉపవసించిన వారు ఇంట్లో గానీ బయట గాని దేవాలయంలో గాని భగవంతుని ప్రసాదాన్ని నిరాకరించరాదు. ఉపవాసం చేసేది భగవదారాధన కోసమే కావున భగవంతుని ప్రసాదాన్ని నిరాకరించడం సమంజసం కాదు. ఉపవాసం ఉన్నా ప్రసాదాన్ని చాలా సూక్ష్మ పరిమాణంలో తీసుకోవచ్చు గానీ ఆహారంగా తీసుకోరాదు. ఇంట్లో గానీ దేవాలయంలో గానీ ఏకారణం చేత ప్రసాదాన్ని తిరస్కరించరాదు.

    Leave a Reply