Campaign | గ్రామాభివృద్ధికి కృషి చేస్తా..

Campaign | గ్రామాభివృద్ధికి కృషి చేస్తా..

  • దయాపంతులపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోస్గి కమలమ్మ కుమార్

Campaign | నవాబుపేట, ఆంధ్రప్రభ : నవాబుపేట మండల‌ పరిధిలోని దయాపంతులపల్లి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని దయాపంతులపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోస్గి కమలమ్మ కుమార్ తెలిపారు. ఇవాళ‌ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా తాను సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. పారిశుధ్యం, డ్రైనేజీ, సీసీ రోడ్లుచ‌ వీధిలైట్లుచ‌ ఇతర సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

గతంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేయడం జరిగిందని ఆమె వివరించారు. గత పదేళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి గెలిపించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తానని ఓటర్లకు విన్నవించారు. గ్రామంలో అర్హత కలిగిన వారికి పెన్షన్లు, ఇండ్ల స్థలాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రభుత్వ సంక్షేమ పథకాల‌న్నీ ప్రజలకు అందేలా కృషి చేస్తానని తెలిపారు. రాబోయే కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని, సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు.

Leave a Reply