Campaign | మంత్రి వాకిటి అండతో అభివృద్ధి చేస్తా..

Campaign | మంత్రి వాకిటి అండతో అభివృద్ధి చేస్తా..

  • ప్రజలు ఆశీర్వదించి ఎన్నికలో గెలిపించండి

Campaign | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజలందరూ ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థి దంతన్ పల్లి సుజాత యగ్నేశ్వర్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపించాలని, మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో గ్రామంలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని సింగిల్ విండో అధ్యక్షులు బాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు సూర్య ప్రకాశ్ రెడ్డి, మణెమ్మ, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఎల్కోటి నారాయణరెడ్డి, గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలోని ఆయా ప్రాంతాల్లో అభ్యర్థితో కలిసి కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేపట్టారు. గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అడిగారు.

సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులను గెలిపిస్తే అభివృద్ధి చెందుతుందని వివరిస్తున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. ఊట్కూర్ లో 16 వార్డుల్లో నెలకొన్న సమస్యలు తమకు తెలుసని వాటిని పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందని గ్రామంలోని ప్రతి వ్యక్తి రాజకీయాలు పక్కనపెట్టి గ్రామ అభివృద్ధి కోసం సుజాతను సర్పంచ్ గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి వాకిటి శ్రీహరితో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి ఊట్కూర్ రూపురేఖలు మారుస్తామన్నారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని ప్రచారంలో ప్రజలకు వివరించారు. 20 ఏళ్లుగా సుజాత యగ్నేశ్వర్ రెడ్డి గ్రామానికి నిస్వార్థంగా సేవలు చేశారని సేవలు గుర్తించి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్, మైనార్టీ మండల అధ్యక్షులు జలాల్, పట్టణ అధ్యక్షులు లింగంతో పాటు అభ్యర్థులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply