కేసీఆర్ క్యాంప్ కార్యాలయం పై దాడి పట్ల ఖండన

కేసీఆర్ క్యాంప్ కార్యాలయం పై దాడి పట్ల ఖండన

ఆలేరు, ఆంధ్రప్రభ : గజ్వేల్ లో మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయం పై జరిగిన దాడి అమానుషమైందని జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ గిరిరాజు వెంకటయ్య ఆదివారం చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించని నిరంకుశ వైఖరికి నిదర్శనమే ఈ దాడి అని ఆయన తెలిపారు. తెలంగాణ సమాజం జరుగుతున్న ప్రతి సంఘటనను జాగ్రత్తగా గమనిస్తున్నదని ఆయన చెప్పారు.

ప్రజలు సరైన సమయంలో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని తగిన బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండించాలని ఆయన కోరారు. క్యాంప్ కార్యాలయం పై దాడికి జరిపిన దోషులను గుర్తించి చట్టపరంగా శిక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దౌర్జన్యంగా దాడులు ఏ రూపంలో జరిగినా ఖండించాలని ఆయన చెప్పారు.

Leave a Reply