Camp Office | సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
పాల్గొన్న ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Camp Office | అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Soni Gandhi) జన్మదినాన్ని ఇవాళ అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రజాభవన్) లో భారీ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, తమిళనాడు రాష్ట్ర ఎఐసిసి పరిశీలకులు, నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ ప్రత్యేకంగా పాల్గొని కేక్ కట్ చేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ (Mla Vamsikrishna) మాట్లాడుతూ… సోనియాగాంధీ త్యాగం, నిస్వార్థ సేవకు ప్రతీక అన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమె చూపిన ధైర్యం, పట్టుదల అందరికీ స్ఫూర్తి అన్నారు. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా చట్టం వంటి చారిత్రక మార్పులు ఆమె నాయకత్వంలోనే సాధ్యమై నేటికీ దేశ ప్రజలకు మేలు చేస్తూనే ఉన్నాయన్నారు. ఆమె ఆశయ స్ఫూర్తితో నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి విద్య–వైద్యం అందుబాటులో ఉండేలా కృషి చేస్తూనే ఉంటామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

