Tiger attack |పులి దాడిలో లేగ‌దూడ మృతి

కాసిపేట, జులై 8 (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి అటవీ సెక్షన్ పరిధి వెంకటాపూర్ (Venkatapur) అటవీ ప్రాంతంలో లేగదూడపై పెద్దపులి (Tiger) దాడి చేసిన ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు మంగళవారం గుర్తించారు. అది వెంకటాపూర్ గ్రామానికి చెందిన బద్దె రాజలింగు (Badde Rajalingu) అనే వ్యక్తికి సంబంధించిన లేగదూడగా అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి అటవీ క్షేత్రాదికారి పూర్ణచందర్ తెలియ చేస్తున్నారు.

Leave a Reply