Calendar | నూతన క్యాలెండర్ ఆవిష్కరణ..

Calendar | నూతన క్యాలెండర్ ఆవిష్కరణ..
Calendar | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో ఇవాళ పి ఆర్ టి యు టి ఎస్ నూతన క్యాలెండర్(Calendar) ను పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కొండ జనార్ధన్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు టీఎస్ యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని, ఉద్యోగ ఉపాధ్యాయులకు 50శాతం ఫిట్మెంట్ తో పి.ఆర్. సి ని ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న డీ.ఏ.లను, పెండింగ్లో ఉన్న జిపిఎఫ్, టిఎస్జిఎల్ఐ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో(Zero One Zero) కింద జీతభత్యాలు చెల్లించాలన్నారు.
కేజీబీవీ, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారిని రెగ్యులర్ చేయాలని కోరారు.
ఈసమావేశంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావెనవేని రవి, మల్యాల మల్లేష్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అప్పాల మనోహర్, వరలక్ష్మి, పాత రమేష్, కర్నె నరేందర్, బి.ప్రభాకర్, మల్లూరి వినోద్, పోలంపల్లి రామరాజు, ముత్తినేని రమేష్, పోలంపల్లి శ్రీనివాస్, బి రాజన్న, రిటైర్డ్ ఉపాధ్యాయులు అన్నం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
