Calander | ఆంధ్రప్రభ అంటే ఎంతో మక్కువ

Calander | ఆంధ్రప్రభ అంటే ఎంతో మక్కువ
Calander | వాంకిడి, ఆంద్రప్రభ : మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంద్ర ప్రభ 2026 దినపత్రిక క్యాలెండర్ను మండల అధ్యక్షుడు గుర్నులే నారాయణ ఆవిష్కరించారు. ఆంధ్రప్రభ 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడారు.. పత్రికా విలువలను, డిజిటల్ రంగంలో ఆంధ్రప్రభ సాధిస్తున్న ప్రగతిని ప్రత్యేకంగా కొనియాడారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుండే నిక్కచ్చిగా వార్తలను అందిస్తున్న చరిత్ర ఆంధ్రప్రభకు ఉందని గుర్తుచేశారు. సమాజంలోని యథార్థాలను ప్రజలకు చేరవేయడంలో ఆంధ్రప్రభ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకకుండా, కేవలం ప్రజా సమస్యలే ఎజెండాగా పని చేయడం అభినందనీయమన్నారు.
డిజిటల్ విప్లవంలో ఆంధ్రప్రభ ముందడుగు.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంధ్రప్రభ డిజిటల్ రంగంలో కూడా దూసుకెళ్తొందని గుర్నులే నారాయణ కొనియాడారు.కేవలం వార్తాపత్రికగానే కాకుండా, ఆంధ్రప్రభ యాప్,వెబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజల అరచేతిలోకి తీసుకువస్తున్నారని ప్రశంసించారు. ప్రతిరోజూ సాయంత్రం వెలువడే ‘స్మార్ట్ ఎడిషన్’ ద్వారా తాజా వార్తలను అందించడం విశేషమన్నారు. యూట్యూబ్ వేదికగా కూడా ఆంధ్రప్రభ ప్రజలకు చేరువవుతూ ముందంజలో ఉందని గుర్నులే నారాయణ అన్నారు. వాంకిడిలో జరిగిన ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సామెల గ్రామపంచాయతీ వడ్గురే సంతోష్, కాంగ్రెస్ నాయకులు పలువురు పాల్గొన్నారు. ఆంధ్రప్రభ వాంకిడి మండల రిపోర్టర్ పొన్నాల రాజేష్,పాత్రికేయుడు కృష్ణపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
