cable wire | హెడ్‌మాస్టర్ మృతి..

cable wire | హెడ్‌మాస్టర్ మృతి..
cable wire | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేబుల్ తీగ మెడకు చుట్టుకుని హెడ్‌మాస్టర్ మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చీరాల మండలం దేవినూతల సమీపంలో ఇవాళ హెడ్‌మాస్టర్ శ్రీనివాసరావు (56) బైక్‌పై స్కూల్‌కు వెళ్తున్నారు.
ఈ క్రమంలో వేళాడుతున్న కేబుల్ తీగ ప్రమాదవశాత్తు ఆయన మెడకు చుట్టుకుంది. దీంతో ఆయన ఎగిరిపడ్డారు. తీవ్రగాయాలతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు గవినివారిపాలెం జడ్పీ హైస్కూల్‌లో హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు.
