Cabinet | జిల్లాల పునర్వ్యవస్థీకరణ!

Cabinet | జిల్లాల పునర్వ్యవస్థీకరణ!
- అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
Cabinet | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణలో జిల్లా పునర్వ్యవస్థీకరణ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ(Department of Revenue) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ రోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. గత పాలకుల హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు అస్త్యవస్థంగా ఉన్నాయని, అందుకు పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు రామ్మోహన్ రెడ్డి, వీరేశం, పాల్యాయి హరీష్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేబినెట్(Cabinet)లో విస్తృతంగా చర్చించి, రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారుల నుంచి ప్రత్యేక నివేదిక తెప్పించి, ఇదే శాసనసభలో చర్చ చేపట్టి, అందరి ఆమోదంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.
