దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంబిస్తున్న ఎమ్మెల్యే..

దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంబిస్తున్న ఎమ్మెల్యే..
ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం…
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, ఆంధ్రప్రభ : సెంట్రల్ నియోజకవర్గంలోని పైపుల రోడ్డు వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు దివ్యాంగులకు బస్ టికెట్లు అందజేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నేడు అమలు చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు లక్షమందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని, బస్సుల్లో సీట్ల కేటాయింపులో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ సోమేశ్వరరావు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
