బస్సు సర్వీస్ పునరుద్ధరణకు వినతి పత్రం అందజేత

బస్సు సర్వీస్ పునరుద్ధరణకు వినతి పత్రం అందజేత
బెజ్జంకి, ఆంధ్రప్రభ : గ్రామస్థుల ప్రయాణ సౌకర్యార్థం నిలిపివేయబడిన బస్సు సర్వీసును పునరుద్ధరించాలని కోరుతూ బుధవారం రోజున స్థానిక ప్రతినిధులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు TGRTC కరీంనగర్ డిపో–1కు చెందిన రూట్ ప్లానింగ్ సీ.ఐ హిమబిందును కలిసి వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ డిపో–1 నుండి తోటపల్లి, వీరాపూర్, లక్ష్మీపూర్, బేగంపేట, గూడెం గ్రామాల మీదుగా బెజ్జంకి వరకు మధ్యాహ్నం 12 గంటలకు నడిచే బస్సు ట్రిప్‌ను పునరుద్ధరించాలని కోరారు. ఈ బస్సు సర్వీస్ నిలిపివేయడంతో విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడానికి ఈ బస్సు సర్వీస్ ఎంతో అవసరమని, తక్షణమే పునరుద్ధరించాలని వారు అధికారులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ చిలివేరు శ్రీనివాస్ రెడ్డి, వీరపూర్ సర్పంచ్ చిలుముల సతీష్,ఉపసర్పంచ్ లు హరీష్, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి స్థానిక నాయకులు,పాల్గొన్నారు
