సీఎం దిష్టిబొమ్మ దహనం..

సీఎం దిష్టిబొమ్మ దహనం..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(State Chief Minister Revanth Reddy) హిందువుల పైన, భారత దేశ సైనికులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసిస్తూ ఈ రోజు చౌటుప్పల్ పట్టణంలో బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు గుజ్జుల సురేందర్ రెడ్డి, దూడల బిక్షం గౌడ్ లు మాట్లాడుతూ.. పూటకో పార్టీ మరే రేవంత్ రెడ్డికి భారత సైన్యం చరిత్ర తెలియద‌న్నారు.

ఆపరేషన్ సింధూర(Operation Sindura)పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ పుట్టిన దేశం మీద లేకపోవడం సిగ్గు చేటని, ఎంఐఎం పార్టీ ఓటు బ్యాంకు కోసం హిందువుల పైన భారతీయ జనతా పార్టీ పైన నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. సిఎం రేవంత్ రెడ్డి తన అవసరం కోసం ఎంతకైనా దిగజారే విధంగా మాటలు మాట్లాడుతున్నారని, భారత సైన్యం పోరాటాన్ని అవమానపరిచి మాట్లాడిన కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు తగిన గుణపాటం చెప్పారని, రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి కూడ అదేగతి పడుతుంధన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కైరంకొండ అశోక్, నాయకులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి(Kancharla Govardhan Reddy), చినుకని మల్లేష్, యాస అశోక్ రెడ్డి, పబ్బతి శేఖర్ గౌడ్, కట్ట కృష్ణ లగోని పాండు పోట్టబత్తిని బాలరత్నం, పులిగిల్ల శ్రీనివాస్ చారి, అల్మాస్పేట గౌతమ్, గుర్రం రవీందర్, పాలాది పాండు, మద్దోజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply