Bumper majority | సంగెం కలాన్‌లో సమస్యలన్నీ తీరుస్తాం
- సర్పంచుగా భాగ్యలక్ష్మీని గెలిపించాలి.
- డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్
Bumper majority | తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : తాండూరు మండలం సంగెంకలాన్ లో సమస్యలన్నీ తీర్చడంతోపాటు గ్రామాభివృద్ధికి(village development) కృషి చేస్తామని డీసీసీబీ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ అన్నారు. గ్రామ సర్పంచు అభ్యర్థిగా పోటీ చేస్తున్న భాగ్యలక్ష్మీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి భాగ్యలక్ష్మీకి కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నో సంవత్సరాలుగా గ్రామ సర్పంచులుగా గెలిచి సేవలు అందించడం జరిగిందని గుర్తుచేశారు. ప్రజలు ఆశీర్వదించి పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని అభివృద్ధి పరచడం జరిగిందని తెలిపారు. ఈసారి కూడా జరిగే ఎన్నికల్లో(elections) భాగ్యలక్ష్మీకి పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు.
గ్రామంలో సమస్యలను అన్నింటిని పరిష్కరించేందుకు బాధ్యతగా పనిచేస్తామన్నారు. కత్తెర గుర్తుకు ఓటేసి భాగ్యలక్ష్మీకి బంపర్ మెజార్టీ(Bumper majority) ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే సహాకారంతో అందరికి సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చూస్తామన్నారు.


