- భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షన
- రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు
- ఏపీ మాజీ డిప్యూటీ సీఎం సోదరుడిపై ఫిర్యాదు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాయదుర్గం ప్రాంతంలో సోమవారం భూ వివాదం కారణంగా కాల్పుల కలకలం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య కొంతకాలంగా నడుస్తున్న భూ సమస్య ఈరోజు ఘర్షణగా మారింది. ఈ క్రమంలో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి సోదరుడు ప్రభాకర్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం.
కాల్పుల శబ్దంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనపై మరో వర్గం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రభాకర్‌పై చేసిన ఫిర్యాదు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

