Budget 2025 | పొల‌వ‌రంకు రూ.30వేల కోట్ల‌కు ఆమోదం

అమ‌రావ‌తి – పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం రూ.30,436.95 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2025-26 బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలవరం బ్యాలెన్స్ గ్రాంట్ రూ.12,157.53 కోట్లుగా కేంద్రం తెలిపింది.

ఇక నీటి నిల్వ ఎత్తును 41.15 మీట‌ర్ల‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.. 2025-26 బడ్జెట్ లో రూ.12,157.53 కోట్లను కేంద్రం కేటాయించింది. గత ఏడాది బడ్జెట్ లో కూడా పోలవరం ప్రాజెక్టుకు రూ.12వేల కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. గత బడ్జెట్ లో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులకు రూ.15 వేల కోట్లు కేటాయించారు. ఈ నిధులను అప్పుల రూపంలో ఇప్పించనుంది కేంద్రం. ఈ రుణాలు ఇచ్చే సంస్థలకు కేంద్రం గ్యారంటీ ఇస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *