తల్లీకూతుళ్ల దారుణహత్య..
తెలంగాణలోని జనగామ జిల్లా (Jangaon district) లో మానవత్వాన్ని కంటతడి పెట్టించే విధంగా ఒక దారుణ ఘటన (Terrible incident) చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు అత్యంత దారుణ హత్యకు గురయ్యారు. తమ్మడపల్లి(ఐ) గ్రామంలో ఓ తల్లీకూతుళ్లు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి, నిష్టూరంగా పొడిచి, తలలు పగలగొట్టి హత్య చేశారు. పోలీసులు (police) తెలిపిన వివరాల ప్రకారం తమ్మడపల్లి(ఐ) గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తల్లి (75), కుమార్తె (45)ను గుర్తుతెలియని దుండగులు చంపేసి, పారిపోయారు.
తమ్మడపల్లి(ఐ) గ్రామానికి చెందిన మహిళలు (women) ఇద్దరూ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇద్దరిని కత్తులతో పొడిచి తలలు పగలగొట్టి కిరాతకంగా చంపేశారు. శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి అలికిడి రాకపోవడంతో అనుమానంతో స్థానికులు ఇంట్లో చూడగా ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిసరాలను తనిఖీ చేశారు.
దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను జల్లడపడుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు (Investigated). ఆస్తి తగాదాలతోనే ఈ హత్యలు చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లీకూతుళ్ల హత్య (mother and daughter Murder) తో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.