BRS senior leader | ఇంకెన్నాళ్లీ వంచన?

BRS senior leader | ఇంకెన్నాళ్లీ వంచన?
- కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం పోయింది
- అభివృద్ధిని మరిచిన కాంగ్రెస్ పార్టీ
- మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదు
- ఓటమి భయంతోనే కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు
- 420 హామీల్లో ఒక్కటీ నెరవేర్చని హస్తం నాయకులు
- పురపోరులో గులాబీ జెండా ఎగరడం ఖాయం
- బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రూపారెడ్డి
BRS senior leader | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రూపారెడ్డి ఆంధ్రప్రభ*కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మోసపోయి గోస పడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు మంచి చేయడం మరిచిపోయి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై లేనిపోని వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మున్సిపల్ ఎన్నికల కోసం సభలు పెట్టి ప్రచారం చేయడం రేవంత్ దిగజారుడు తనానికి నిదర్శమనమని ఎద్దేవా చేశారు.
420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చని కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. మోసపోయిన ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి తెలంగాణలో అంత సీన్ లేదు. దానికి అసలు మనుగడే లేదు. కేంద్రం నుంచి ఎంతమంది బడా లీడర్లు వచ్చి ప్రచారం చేసినా ఆ పార్టీని ప్రజలు పట్టించుకోరు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రూపారెడ్డి *ఆంధ్రప్రభ ఇంటర్వ్యూలో చెప్పారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆమె మరికొన్ని విషయాలు ఆంధ్రప్రభతో పంచుకున్నారు. అవి తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను తిలకించండి..
