మూడు విడతల రైతు భరోసాను విడుదల చేయాలి

మూడు విడతల రైతు భరోసాను విడుదల చేయాలి

  • బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్

దండేపల్లి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మూడు విడతలుగా ఎగ్గొట్టిన రైతు భరోసా వెంటనే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు రైతులకు మద్దతుగా శనివారం దండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి భవనం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు విజిత్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉన్న రైతులను పూర్తిగా మోసం చేసారని అన్నారు.

ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన మూడు విడుతల డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.మహిళలకు 2500 ఇస్తామని మహిళలను కూడా మోసం చేసారని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేటప్పటికి రైతు భరోసా పూర్తిగా విడుదల చేయాలని లేదంటే మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా రైతుల పక్షాన కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తామన్నారు తెలిపారు.

రైతులకు అన్యాయం జరిగితే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని రైతుల కోసం పోరాడడానికి ఎల్లప్పుడూ బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, దండేపల్లి మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, లక్షెట్టిపేట మాజీ డీసీఎంఎస్ చైర్మన్లు కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తిప్పని లింగయ్య, సర్పంచులు,మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు.

Leave a Reply