BRS Party | జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు బయలుదేరిన కెటిఆర్ .. చౌటుప్పల్ లో వద్ద ఘన స్వాగతం

హైద‌రాబాద్ – మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజా సమస్యలతో పాటు.. క్యాడర్‌లో జోష్ నింపటమే లక్ష్యంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా సూర్యాపేట పేటలో జరిగే కార్యక్రమం కోసం హైదరాబాద్ నుంచి అక్కడికి చేరుకున్నారు… ఈ సందర్బంగా చౌటుప్పల్ లో వద్ద కేటీఆర్ కి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.. అనంతరం నేతలను, కార్యకర్తలను అప్యాయంగా పలకించి సూర్యాపేటకు బయలుదేరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు పెద్దింటి బుచ్చిరెడ్డి, కర్నాటి వెంకటేశం, రైతుబంధు మండలం మాజీ అధ్యక్షుడు కొత్త పర్వతాలు యాదవ్, రైతుబంధు మాజీ జిల్లా డైరెక్టర్ ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, నాయకులు గుండెబోయిన అయోధ్య యాదవ్, ఢిల్లీ మాధవరెడ్డి, మెట్టు మహేశ్వర్ రెడ్డి, గుండెబోయిన వెంకటేష్ యాదవ్, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, ఉడుగు మల్లేష్ గౌడ్, సుర్వి మల్లేష్ గౌడ్, మునుకుంట్ల నరసింహ గౌడ్, బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎండీ హతర్ పాషా, నలపరాజు రమేష్, చెక్క రాములు తదితరులు పాల్గొన్నారు.

సిల్వర్‌జూబ్లీ సంబురాలు..

సిల్వర్‌జూబ్లీ సంబురాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ సమాయత్తమవుతోంది.వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఓ ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఈ వేడుకలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్‌ జిల్లా నాయకులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణభవన్‌లో సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వరంగల్‌‌‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనునట్టు పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ స‌మావేశాల అనంత‌రం ..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల అనంతరం కేటీఆర్‌ అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. 14 ఏళ్ల ఉద్యమం ప్రస్థానం, పదేండ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్‌ఎస్‌ పార్టీ పెనువేసుకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సమావేశాల సందర్భంగా కేటీఆర్ మరోసారి గుర్తుచేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *