హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు లీడర్లు సన్నద్ధమవుతున్నారు. ఈనెలాఖరులో వరంగల్ వేదికగా సభ నిర్వహణకు ఇప్పటికే ప్రణాళికలు సైతం రచించారు. ఎల్కతుర్తి వద్ద 10లక్షల మందితో భారీ సభ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాసీ సీఎం కేసీఆర్ కీలక నేతలకు సూచించారు.
ఈ క్రమంలోనే వరుసగా జిల్లా నేతలతో భేటీ అవుతున్నారు. సభను విజయవంతం చేయాలని, అందుకు జనసమీకరణ చేపట్టాలని కేసీఆర్ ఆదేశిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం తన వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లిలో నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ స్థితిగతులు, వరంగల్ సభ గురించి నాయకులతో చర్చించనున్నారు.