బీఆర్ఎస్ నాయకుల నిరసన.. అరెస్ట్

బీఆర్ఎస్ నాయకుల నిరసన.. అరెస్ట్
చెన్నూర్, ఆంధ్రప్రభ :మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ ను నిరాశిస్తూ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన జిల్లా బంద్ పిలుపు లో భాగంగా చెన్నూర్ పట్టణబంద్ లో పాల్గొన్న స్థానిక నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపల్ చెర్మెన్ ఎంపికలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య గత నాలుగు రోజులుగా జరుగుతున్న గొడవలలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు స్థానిక నాయకులు లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మల్లెల దామోదర్ రెడ్డి, మాజీ జడ్పీటీసి తిరుపతి తదితర నాయకులు పట్టణంలో బంద్ కు ప్రయత్నలు చేస్తున్న క్రమంలో టౌన్ సీఐ బన్సీలాల్ పోలీసు సిబ్బంది నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

