ములుగు బీఆర్ఎస్ నేతలు
వెబ్ డెస్క్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ (JubileeHills) అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో గురువారం ములుగు మండల పిఎసిఎస్ వైస్ ఛైర్మెన్ కుక్కల నరేష్ గౌడ్ తో పాటు బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ రహమత్ నగర్ లోని 160,164 బూతుల్లో తిరుగుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కోరారు.
ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని ఎల్లారెడ్డిపేట (Yellareddypet) లో పీ.విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేష్ గౌడ్ షేక్ పేటలో ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరేష్ గౌడ్ మాట్లాడుతూ… ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. ఏ ఇంటికి వెళ్లి ఓటర్లను పలకరించిన కేసీఆర్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తున్నారన్నారు.
గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ (Maganti Sunitha Gopinath) గెలుపుకు నాంది పలుకుతాయని నరేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నికల ప్రచారంలో బూతుల ఇన్చార్జీలు గడ్డం శ్రీధర్, మాయలత, బీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ పాషా, ప్రకాష్ ,వెంకటేష్, శివకుమార్, సుధాకర్, శివశంకర్, బాలు, సత్యవతి,మధు, మురళి, తదితరులు పాల్గొన్నారు.