MBNR | బీఆర్ఎస్ నేత డా. కుర్వ విజయ కుమార్ అరెస్ట్

గద్వాల (ప్రతినిధి) జూన్ 13 (ఆంధ్రప్రభ) : సీడ్ కంపెనీ (Seed Company), సీడ్ ఆర్గనైజర్ల కారణంగా సీడ్ పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి వివ‌రిస్తుండ‌గా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కుర్వ విజయ్ కుమార్ (Kurva Vijay Kumar) ను పోలీసులు అరెస్టు చేశారు. గత వారం రైతు సమస్యలను రైతు సంక్షేమ కమిషనర్ కోదండరెడ్డికి తెలుపగా, ఆయన ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా, పూటన్ పల్లి గ్రామానికి సీడ్ పత్తి రైతుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకువచ్చారు.

ఈ సందర్భంగా వారి సమస్యలను వివరించేందుకు వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్టు చేయించారని తెలిపారు. ఇలా అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. గద్వాల మండలం పుటాన్ పల్లి (Putan Palli) గ్రామం దగ్గర కురువ విజయ్ కుమార్ తోపాటు మరో 30మందిని అరెస్టు చేసి ధరూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Leave a Reply