12వ వార్డులో బీఆర్‌ఎస్‌ జోరు..

12వ వార్డులో బీఆర్‌ఎస్‌ జోరు..

  • ఇంటింటి ప్రచారానికి వెల్లువెత్తిన మద్దతు

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూరపాటి కవిత యాదగిరి గెలుపు దిశగా దూసుకుపోతున్నా రు. శుక్రవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్బంగా ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు ఓటర్లు కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రతి ఇంటి వద్ద బీఆర్‌ఎస్‌కే మద్దతు అంటూ ఓటర్లు ధీమా వ్యక్తం చేయడం ప్రచారానికి మరింత ఊపునిచ్చింది.

వార్డులో బీఆర్‌ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని అభ్యర్థి కూరపాటి కవిత యాదగిరి ధీమా వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్‌ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హయాంలో జరిగిన అభి వృద్ధిని గుర్తు చేస్తూ, బీఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తమ విజయానికి పునాదిగా మారాయని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 12వ వార్డులో బీఆర్‌ఎస్ విజయం తథ్యమని, కూరపాటి కవిత యాదగిరి గెలుపు ఖాయమని స్థానిక ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ కార్యక్ర మంలో బీఆర్‌ఎస్ నాయకులు కీర్తి వెంకటేశ్వ ర్లు, భూపతి రాజు, భాగ్యలక్ష్మి తదితరులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply