బీఆర్ఎస్ కు నైతిక విలువ లేదు..
మైనంపల్లి హనుమంతరావు
నిజాంపేట, అక్టోబర్14(ఆంధ్రప్రభ) : మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ (leela group) చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ ల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై రోగులకు ఉచిత మందులను అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండలానికి ఈశాన్యం మూల అయినటువంటి రాంపూర్ గ్రామంలో డాక్టర్ మోహన్ నాయక్ (Dr. Mohan Nayak) ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి గ్రామంలో ఉచిత క్యాంపులు ఏర్పాటు చేస్తామని ఈ గ్రామం నుండి పనులు ప్రారంభించినట్టయితే శుభం కలుగుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుందని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మూడు సంవత్సరాల కాలంలో నెరవేరుస్తామన్నారు.10 ఏళ్ల బిఆర్ఎస్ (Brs) పాలనలో ఒక గ్రామానికి సీసీ రోడ్డు వేయించిన దాఖలాలు లేవని బీఆర్ఎస్ ను విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు, మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కొమ్మట బాబు, పంజా మహేందర్, నసీరుద్దీన్, మారుతి, మాజీ సర్పంచ్లు కొమ్మట సత్యనారాయణ,ఆకుల బాలయ్య, బాజా రమేష్, మధుసూదన్ రెడ్డి, నాగరాజు, రాజు నాయక్, శ్రీనివాస్ నాయక్, మహేందర్ రెడ్డి, గరుగుల శ్రీనివాస్, అందే స్వామి,సూరా రాములు, తదితరులు పాల్గొన్నారు.