BRS | ఒక్క అవకాశం ఇవ్వండి- తాటికొండ మధు..

BRS | ఒక్క అవకాశం ఇవ్వండి- తాటికొండ మధు..

  • -ఎమ్మెల్సీ పోచంపల్లి సహకారంతో 200 కుట్టు మిషన్లు ఇప్పిస్తాను..
  • -వార్డ్ లో కాలువల నుంచి కమ్యూనిటీ హాల్ వరకు అభివృద్ధి చేస్తాను..
  • -డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను..
  • -అవినీతి లేకుండా సహాయం అందేలా చూస్తాను..
  • -అర్హులకు అందరికి పథకాలు అందేలా కృషి చేస్తాను..
  • -నిరంతరం అందరికి అందుబాటులో ఉంటాను..
  • -మీ ఇంటి బిడ్డగా.. నన్ను ఆశీర్వదించండి..

BRS, స్టేషన్‌ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలోని 1వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా తాటికొండ మధు పోటీ చేస్తున్నారు. భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘంలో రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిల్లో గత 20 ఏళ్లుగా కార్మికుల సమస్యల పై నిరంతరం పోరాడుతున్న నాయకుడు. రాజకీయ అనుభవం పరంగా 15 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ, భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో ఇదే వార్డులో కేవలం 6 ఓట్ల తేడాతో ఓటమి చెందిన ఆయనకు ఈసారి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని స్థానికులు భావిస్తున్నారు.

అభివృద్ధే నా అజెండా..
వార్డులో బుధవారం స్థానిక నాయకులతో అభ్యర్థి మధు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో వార్డులోని నిరుపేద మహిళలకు 200 కుట్టు మిషన్లు అందిస్తాను. గెలిచిన వెంటనే.. వాటిని ఇప్పించే పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. అలాగే కల్యాణి లక్ష్మి, సీఎం ఆర్‌ఎఫ్ వంటి సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చూస్తానని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాను అని అన్నారు. అనంతరం వార్డ్ లో పలు హామీలను వెల్లడించారు. మాతంగి నర్సయ్య ఇంటి నుంచి జహంగీర్ ఇంటి వరకు ఉన్న పెద్ద కాలువలో మురుగు నీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి కాలనీ ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

అలాగే ప్రైమరీ స్కూల్ ప్రాంతం నుంచి కాలువలు పూర్తిగా మూసుకుపోయి, వర్షపు నీరు రోడ్ల పై ప్రవహించే పరిస్థితి నెలకొంది. సమాధి దగ్గర గేట్ ఉన్నప్పటికీ లాక్ లేకపోవడంతో పాటు, పురుషులు, మహిళల కోసం వేర్వేరు గదులు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ గేట్‌కు లాక్ ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన సదుపాయాలు కల్పించి, కాపరి నియామకం చేపడతామని.. తాటికొండ మధు హామీ ఇచ్చారు. తాటికొండ మధు ఇంటి నుంచి దయాకర్ ఇంటి ముందు సర్వీస్ రోడ్ వరకు రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయి, కాలువలు కుదుకుపోయి తీవ్ర సమస్యలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలో తక్షణమే మరమ్మతులు చేపడతానని తెలిపారు. అలాగే సింగాపురం రాములు ఇంటి నుంచి రమేష్ పీటీ వరకు కాలువ లేకపోవడం, రోడ్డు ఇరుకుగా ఉండటంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు.

చింత అంజి ఇంటి నుంచి మాతంగి వెంకన్న టీచర్ ఇంటి వరకు లైట్లు, రోడ్లు లేకపోవడం, అలాగే చింత కృష్ణయ్య ఇంటి నుంచి చింత జోజి వరకు దాదాపు 500 మీటర్ల మేర విద్యుత్, రోడ్డు, కాలువలు లేని పరిస్థితిని పూర్తిగా మార్చుతామని హామీ ఇచ్చారు. ఆకారపు అశోక్ ఇంటి ముందు సీసీ రోడ్డు, కాలువల నిర్మాణం చేపడతామని తెలిపారు. బండమీద ఉన్న వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల సీసీ రోడ్లు, కాలువలు లేకపోవడంతో పాటు, కమ్యూనిటీ హాల్ శిథిలావస్థలో ఉందని పేర్కొన్నారు. వాటి మరమ్మత్తులు వెంటనే పూర్తి చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా బాధ్యతగా పని చేస్తానని స్పష్టం చేశారు. గత 15 ఏళ్లుగా పాలించిన నాయకులు వార్డును పట్టించుకోక ఒక్క రూపాయి అభివృద్ధి పనులు చేయలేదు. నన్ను గెలిపిస్తే, మాటలకే పరిమితం కాకుండా ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని మధు ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply