మూడు సార్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేయ‌ని బీఆర్ఎస్‌

మూడు సార్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేయ‌ని బీఆర్ఎస్‌

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ అభివృద్ధి ఒక్క కాంగ్రెస్‌కే సాధ్య‌మ‌ని మంత్రులు ద‌న‌స‌రి అన‌సూయ (సీత‌క్క‌), జూప‌ల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao) అన్నారు. ఈ రోజు మధురానగర్‌లో గడపగడపకు వెళ్లి ప్ర‌చారం నిర్వ‌హించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆశీర్వదించాలని ఓటర్లను మంత్రులు దనసరి అనసూయ (సీతక్క), జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi), మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అభ్య‌ర్థించారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రతి గడపకు వెళ్లి ప్ర‌చారం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతూ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ప్రజల కోసం చేస్తున్న సేవలను వివరించారు. గత మూడు సార్లు బీఆర్ఎస్‌(BRS)కు అవకాశం ఇచ్చినా అభివృద్ధి జరగలేదని ప్రజలకు గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాల‌ని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యం అని సీతక్క అన్నారు.

మూడుసార్లు అవతలి పార్టీకి ఓటేస్తే ఇక్కడ ఒరిగిందేమీ లేద‌న్నారు. ఇందిరా గాంధీ హయాంలోనే ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ(Govt) రంగ సంస్థలు వచ్చాయ‌ని, దీనివల్ల ఇక్కడ అనేక కాలనీలు నిర్మించార‌న్నారు. అభివృద్ధి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అని పేర్కొన్నారు.

గత పది సంవత్సరాలుగా పేదలకు ఉద్యోగాలు రాలేద‌ని, కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, ఉచితంగా సన్నబియ్యం పంపిణీ, ఉచిత రవాణా, ఉచిత విద్యుత్, మహిళలకు(for Women) వడ్డీ లేని లోన్లు, ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల విలువైన ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామ‌ని మంత్రి సీత‌క్క వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయ‌న్నారు.

జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో కూడా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామ‌న్నారు. మూడుసార్లు మాగంటిని గెలిపించిన ఉపయోగం లేద‌న్నారు. ఈసారి గల్లీ బిడ్డ నవీన్ యాదవ్‌కు ఒక అవకాశం ఇవ్వాల‌ని కోరారు.

రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, అందుకే అభివృద్ధి కాంగ్రెస్‌కు సాధ్యమ‌ని, ఇప్పటికే రూ.150 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయ‌ని, ఇళ్లు కావాలంటే, ఉచిత విద్యుత్(Free Electricity) కావాలంటే, సన్న బియ్యం కావాలంటే చేతి గుర్తుకే ఓటేయండ‌ని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. నవీన్ యాదవ్‌ను ఆశీర్వదిస్తే జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి వేగవంతం అవుతుంది అని సీతక్క హామీ ఇచ్చారు.

Leave a Reply