Brs| ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా..

Brs| ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా..
ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతా 18వ వార్డు కౌన్సిలర్ పేడ కంటి రామకృష్ణ
Brs| కల్లూరు, ఆంధ్రప్రభ: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించేందుకు టిఆర్ఎస్ 18వ వార్డు అభ్యర్థిని గా బరిలో ఉన్నానని ఆదరించి గెలిపించుకోవాలని 18వ వార్డ్ అభ్యర్థి పెడకంటి రామకృష్ణ కోరారు . ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రభ తో మాట్లాడారు. కల్లూరు మున్సిపాలిటీ గా ఏర్పడిన తొలి దశలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని, ప్రజలు ఆదరించి గెలిపించుకుంటే మున్సిపాలిటీలో ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. 18వ వార్డును అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు. నేడు జరిగే మున్సిపల్ ఎన్నికలలో కారు గుర్తుపై తమ ఆమూల్యమైన ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు. టిఆర్ఎస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని మరల అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుపై ఓట్లు వేసి ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు.
