BRS | మీ ఆడబిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి..

BRS | మీ ఆడబిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి..
- బీఆర్ఎస్ 6వ వార్డు అభ్యర్థి తుమ్మల రాణి రవి
BRS |పరకాల, ఆంధ్రప్రభ : “ఆడబిడ్డగా వస్తున్న నన్ను ఆశీర్వదించాలి” అని బీఆర్ఎస్ 6వ వార్డు అభ్యర్థి తుమ్మల రాణి రవి ఓటర్లను అభ్యర్థించారు. ఈ రోజు పరకాల మున్సిపాలిటీ విలీనా గ్రామం రాజిపేట 6వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల రాణి రవి ఓటర్లను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి ఆశీస్సులతో 6వ వార్డులో విజయం సాధించడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి తుమ్మల రాణి రవి మాట్లాడుతూ తాను నిత్యం 6వ వార్డు ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఓటర్లు ఆశీర్వదిస్తే, వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తానని అభ్యర్థి తుమ్మల రాణి రవి హామీ ఇచ్చారు. అభ్యర్థి వెంట బీఆర్ఎస్ 6వ వార్డ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
