BRS | కేసీఆర్‌పై కక్ష సాధింపు ఆపేయాలి…

BRS | కేసీఆర్‌పై కక్ష సాధింపు ఆపేయాలి…
- సిట్ విచారణ ఎత్తివేయాలి
- బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు
- సి ఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
- బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మందుల సత్యం
BRS | మునుగోడు, ఆంధ్రప్రభ : బీఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని, ఆయనను లక్ష్యంగా చేసుకుని కొనసాగిస్తున్న సిట్ విచారణను వెంటనే ఎత్తివేయాలని బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మందుల సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పిలుపుమేరకు బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మండల కేంద్రంలో నినాదాలు చేశారు.అనంతరం మందుల సత్యం మాట్లాడారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి, రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి అభివృద్ధి దిశగా ముందుకు నడిపించిన కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు మోపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. సిట్ విచారణను తక్షణమే రద్దు చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పగిల్ల సతీష్, నాయకులు పూల వెంకటేష్, పొలగోని సైదులు, ఈద శరత్ బాబు, గజ్జల బాలరాజు, జంగిలి సాంబయ్య, నన్నూరి భూపతి రెడ్డి, బోయపర్తి సురేందర్, ముంత మారేష్, వరంగంటి శంకర్, ఎడవల్లి సురేష్, బేరి గురుపాదం, దోటి కరుణాకర్, బండారు శ్రీనివాస్, బంగారు రవి, కందుల రాజు గౌడ్, బోయపర్తి సైదులు, పందుల పాపయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
