BRS | పంచాయతీలన్నీ గెలవాలె

BRS | పంచాయతీలన్నీ గెలవాలె


మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి


BRS | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో (Election) అన్ని స్థానాల్లో మనమే గెలవాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని తన నివాసంలో మక్తల్ మండలంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ… ప్రతి గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి శాయా శక్తులా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభ్యర్థులు కూడా గ్రామాల్లో తమ కార్యకర్తలకు ప్రతిరోజూ సమావేశాలు నిర్వహించి గెలుపు దిశగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధికి దూరమైందన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కాలేదని, 420 హామీలు అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ నాయకులకు పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.

కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని, మళ్ళీ కేసీఆర్ (KCR) రావాలని కోరుకుంటున్నారన్నారు. తిరిగి తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను పూర్తిస్థాయిలో గెలిపించుకోవడం లక్షంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు చిట్టెం సుచరిత రెడ్డి, కొత్త శ్రీనివాస్ గుప్తా, కె.రాజేష్ కుమార్ గౌడ్, చిన్న హనుమంతు, ప్రతాప్ రెడ్డి, బెల్లం శ్రీనివాస్ రెడ్డి, పారేవుల ఆశిరెడ్డి, అన్వర్ హుస్సేన్, మనాన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply