Brother died | విషాదంలో క్రికెటర్ సికిందర్ రజా

Brother died | విషాదంలో క్రికెటర్ సికిందర్ రజా
- జింబాబ్వే కెప్టెన్ తమ్ముడు అనారోగ్యంతో మృతి
Brother died | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : జింబాబ్వే టీ 20 కెప్టెన్ సికందర్ రజా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన 13 ఏళ్ల తమ్ముడు ముహమ్మద్ మహ్దీ(Muhammad Mahdi) హీమోఫీలియాతో బాధపడుతూ కన్నుమూశాడు. ఈ వార్త క్రికెట్ ప్రపంచాన్ని కలచివేసింది. ఈ కష్ట సమయంలో రజాకు అండగా నిలుస్తున్నట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు తెలిపింది. టీ 20 వరల్డ్ కప్ ముందు ఈ విషాదం రజాకు తీరని లోటు. రానున్న టీ 20 వరల్డ్ కప్(T20 World Cup)లో జింబాబ్వే జట్టుకు రజా నాయకత్వం వహించనున్నాడు.
మెహదీ పుట్టుకతోనే హీమోఫీలియా అనే రక్త సంబంధిత వ్యాధి(Blood related disease)తో బాధపడుతున్నాడు. ఇటీవల ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రం కావడంతో 2025 డిసెంబర్ 29న హరారేలో తుదిశ్వాస విడిచాడు. డిసెంబర్ 30న హరారేలోని వారెన్ హిల్స్ శ్మశానవాటికలో మెహదీ అంత్యక్రియలు నిర్వహించినట్లు బోర్డు తెలిపింది. “సికిందర్ రజా కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో బోర్డు సభ్యులు, మేనేజ్మెంట్, ఆటగాళ్లు, సిబ్బంది అందరూ రజా కుటుంబానికి అండగా ఉంటాం. మెహదీ ఆత్మ(Mehdi Atma)కు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం” అని జింబాబ్వే క్రికెట్ పేర్కొంది. ఈ వార్తపై సికిందర్ రజా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. జింబాబ్వే క్రికెట్ బోర్డు ట్వీట్‌కు రిప్లై ఇస్తూ, ఒక ‘బ్రోకెన్ హార్ట్’ ఎమోజీని షేర్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
