HELP HELP పెన్నానదిలో ఆరుగురు బిక్కుబిక్కు

HELP HELP పెన్నానదిలో ఆరుగురు బిక్కుబిక్కు
- పెన్నానదిలో చిక్కుకుని ఆర్తనాదాలు
నెల్లూరు ప్రతినిధి ఆంధ్రప్రభ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద పెన్నానది (Penna River) మధ్యలో ఆరుగురు పశువుల కాపర్లు ( 6 Shephards) చిక్కుకున్నారు. శనివారం ఉదయం అప్పారావు పాలెం (Appa Rao Palem) నుండి పశువులు మేపుకునేందుకు పెన్నా నదిలోకి వెళ్ళారు.పశువులు మేపుకోవడానికి వెళ్లి తిరిగి వస్తూ ఒకసారిగా వచ్చిన నీటి ప్రవాహంతో ( river water flow) మధ్యలో (Trapped) చిక్కుకు పోయారు. నీటిలో పెరిగే జమ్మును పట్టుకుని సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది..
