Breaking News | శ్రీశైలం టన్నెల్లో ప్రమాదం.. పలువురికి గాయాలు
శ్రీశైలం టన్నెల్లో నేడు ప్రమాదం సంబవించింది.. టన్నెల్ 14వ కిలో మీటర్ల వద్ద ఒక్కసారిగా కుంగింది.. మూడు మీటర్ల మేర కుంగడంలో అక్కడ పని చేస్తున్న కార్మికులకు గాయాలయ్యాయి.. వెంటనే కార్మికులను చికిత్స్ కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, నల్గొండ నుంచి ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల క్రితం మళ్లీ పనులు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మూడు మీటర్ల మేర పైకప్పు కుప్పకూలినట్లు వార్తలు వస్తున్నాయి.. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
